కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ప్రస్తుతం చాలా ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమపై దీని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు కోరనా బారిన పడ్డారు. ఆ లిస్ట్ లో సూపర్ స్టార్ మమ్ముట్టి ఉన్నారు. తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని.. స్వల్ప జ్వరం మినహాయిస్తే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని. ఇంటిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నా అంటూ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మమ్ముట్టి కోలుకున్న వెంటనే తనయుడు దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా నిర్థారణ అయిందని దుల్కర్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేశాడు. నాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది.. స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని.. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానని.. నాతో పాటు ఉన్నవారు కూడా టెస్ట్ చేయించుకోమని.. ఈ పాండమిక్ ఇంకా ముగియలేదు.. అందరూ మాస్క్ ధరించండి.. సురక్షితంగా ఉండండి అంటూ పోస్ట్ లో పేర్కొంది.
Positive. pic.twitter.com/cv3OkQXybs
— Dulquer Salmaan (@dulQuer) January 20, 2022
కాగా మలయాళం యంగ్ యాక్టర దుల్కర్ సల్మాన్ వరుసగా డిఫరెంట్ స్టోరీస్, అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వస్తున్న సినిమా సెల్యూట్. ఈసినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: