టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రిలీజ్ కు సిద్ధంగా ఉంది . “పుష్ప“మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన సమంత ప్రస్తుతం “కాతు వాకుల రెండు కాదల్ “(తమిళ),, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ “యశోద” మూవీస్ లో నటిస్తున్నారు. ఒక ద్విభాషా చిత్రానికి , ఒక హాలీవుడ్ మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాజ్ అండ్ డీకేల దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్” ఫ‍్యామిలీ మ్యాన్ 2 ” వెబ్ సిరీస్ లో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సమంత కు మరో వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చిందని సమాచారం . రాజ్ అండ్ డీకేలు రూపొందించే వెబ్ సిరీస్ లోని తన పాత్ర కై సమంత జిమ్ లో తెగ కష్టపడుతున్నారు. “ఫ‍్యామిలీ మ్యాన్ 2 ” వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో గుర్తింపు పొందిన సమంత కు పలు మూవీ ఆఫర్స్ వస్తున్నాయనీ , ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్ధ యష్ రాజ్ ఫిల్మ్స్ సమంతతో చర‍్చలు జరుపుతున్నట్లు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: