గత ఏడాది శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఆసినిమాతో డీసెంట్ హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. ‘సమ్మోహనం’, ‘వి’ సినిమాల తర్వాత హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తి కాాగా.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమాలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తయిందని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మీద గాజులపల్లె సుధీర్ బాబు సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని బి మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగమయ్యారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. పిజి విందా కెమెరా మెన్‌గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: