వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ఉప్పెన. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు వైష్ణవ్. ఇక ఆ తరువాత కూడా ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ కు పోకుండా కొండపొలం అనే సినిమాతో వచ్చాడు. క్రిష్ ఈసినిమాను ఒక నవల ఆధారంగా తీయగా ఈసినిమాలో కూడా వైష్ణవ్ తేజ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈరోజు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఆయన కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఇప్పటికే వైష్ణవ్ తేజ్ డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కూడా సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ తో కలిసి సంయుక్తంగా ఈసినిమాను నిర్మించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్భంగా అన్న సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కు ప్రేమతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేశాడు. ఈమేరకు తన ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టాడు సాయి తేజ్. డియర్ వైష్ణు బాబు నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. గత ఏడాది మనకు చాలా బ్యూటిఫుల్ ఇయర్.. మొదటి సినిమా మంచి సక్సెస్ అందించింది.. అంతేకాకుండా నీ విజయంతో ప్రేక్షకులు అంగీకారం పొందావు. ఇంకా ఏడాది చివరిలో నాకు ప్రమాదం జరిగినప్పుడు కూడా నువ్వు ఫ్యామిలీకి ఎంతో సపోర్టివ్ గా ఉండటమే కాకుండా ఆ సమయంలో నీకు పెయిన్ ఉన్నప్పటికీ ఎంతో మంది ప్రశ్నలకు, కాల్స్ కు సమాధానాలు ఇచ్చావు. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నీ కళ్లలో ఆనందం నేను చూశాను. లిటిల్ బ్రదర్ మాకు చాలా గర్వంగా ఉంది.. ఇలానే నువ్వు సంతోషంగా, ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు సాయి తేజ్.




[subscribe]
happy birthday babu… love you ❤️#panjavaisshnavtej pic.twitter.com/eEiLr2JgqV
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 13, 2022
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: