నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. బంగార్రాజు పాత్రలో తన చలాకీ నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నాడు నాగార్జున. అందుకే ఈ పాత్ర పేరుతోనే ఇప్పుడు సీక్వెల్ గా బంగార్రాజు సినిమాతో వచ్చేస్తున్నారు. అయితే ఈసినిమాలో నాగార్జునతో పాటు తనయుడు నాగచైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. దీంతో ఈసినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెరిగింది అందరికీ. తండ్రీకొడుకులిద్దరూ మరోసారి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తుండటంతో అక్కినేని అభిమానులు సినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకే ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. పండుగ వాతావరణం మొత్తం ట్రైలర్ లోనే కనిపిస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, నాగ్-చైతన్య సన్నివేశాలు ఇలా అన్నీ ఆకట్టుకుంటున్నాయి.
Here is the #Bangarraju trailer for you!!https://t.co/nc9MIdmq2k#BangarrajuTrailer#BangarrajuonJanuary14th#Pandagalanticinema@chay_akkineni@kalyankrishna_k @meramyakrishnan@fariaabdullah2@iamkrithishetty@anuprubens@dakshaofficial@AnnapurnaStdios @ZeeStudios_
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 11, 2022
కాగా ఈసినిమాలో కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: