యంగ్ హీరో ఆశిష్ హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ కు ఇది ఫస్ట్ మూవీ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. ఇక దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా కాబట్టి టెక్నీషియన్స్ ను కూడా పెద్ద వాళ్లనే తీసుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పాటలు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాకుండా రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా దేవి శ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి మరో పాటను రిలీజ్ చేశారు. డేట్ నైట్ అంటూ సాగే ఈపాటను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Enjoyed watching the Date Night song from #Ashish‘s debut movie #RowdyBoys. All the best to the team!https://t.co/neVxuiVdqu@ThisIsDSP @anupamahere @HarshaKonuganti @Madhie1 @SVC_official @adityamusic #sahidevvikram #karthikrathnam #tejkurapati @komaleeprasad
— Allu Arjun (@alluarjun) January 10, 2022
కాగా శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది. సాహిదేవ్ విక్రమ్ , కార్తీక్ రత్నం , కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: