సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప తో వీరిద్దరూ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు.
ఇక ఈసినిమా కోసం తన మేకోవర్ ను పూర్తిగా మార్చేసుకున్నందుకు బన్నీని ఇప్పటికే అందరూ ప్రశంసిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈసినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా అన్ని పాటలు ఎంత హిట్ అయ్యాయో చూశాం. ఇక వీటిలో ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాట గుర్తుండే ఉంటుంది కదా. ఈ పాటలో బన్నీ ఒక్క షాట్ లోనే చాలా గెటప్స్ లలో కనిపిస్తూ ఉంటాడు. అయితే ఈ షాట్ తీయడానికి చాలా కష్టపడ్డాడట బన్నీ. ఈ విషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి మరీ తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఒక్క షాట్ కోసం బన్నీ దాదాపు 12 గంటల సేపు షూటింగ్ చేశాడట. దాదాపు 24 రకాల కాస్టూమ్స్, పలు వేరియేషన్స్ ఉండటంతో ఈ ఒక్క షాట్ కోసం అంత టైమ్ పట్టిందట. మరి అంత కష్టపడిన దానికి ఫలితం ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం కదా. సౌత్ తో పాటు నార్త్ లో కూడా పుష్పరాజ్ తన హవాను చూపిస్తున్నాడు. సినిమా చూసినవారందరూ బన్నీపై ప్రశంసలు కురిపిస్తున్నారంటే తను పడిన కష్టానికి ఫలితం దక్కినట్టే.
#PushpaBehindTheScenes 🔥🤙@alluarjun put in 12 hours of effort for just this one shot from the song #EyyBidda in #Pushpa. The shoot for this started at 2 pm and went on until 2 am. It involved 24 dress changes and multiple variations. He is truly an icon stAAr! 🤩 pic.twitter.com/NfAxpse6Bd
— Pushpa (@PushpaMovie) January 10, 2022
కాగా ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. మలయాళనటుడు ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషించారు. రెండో పార్ట్ పుష్ప- ది రూల్ త్వరలో రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: