సౌత్ ఇండస్ట్రీలో సమంత నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమైనా సమంత లక్కీ హీరోయిన్ గా వరుస హిట్స్ ను సొంతం చేసుకోవడమే కాదు.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఇప్పుడు పాత్ర ప్రధానమైన సినిమాలు ఎంచుకుంటూ సినిమాలను చేస్తుంది. దీనిలో భాగంగానే సమంతతో కూడా సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు మేకర్స్. ప్రస్తుతానికి అయితే సమంత పలు సినిమాలతో బిజీగా ఉంది. అందులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటుగా సమంత యశోద అనే సినిమాను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హరి – హరీష్ ఈసినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇక ఇటీవలే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లగా అప్పుడే ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. నేడు ఈసినిమా సెకండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు చిత్రబృందం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తమ సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియచేశారు.
Incredible Actress @Samanthaprabhu2‘s multilingual film (Telugu, Tamil, Hindi, Kannada & Malayalam) titled #Yashoda. Shoot begins today🥳
A @krishnasivalenk‘s unique venture directed by @hareeshnarayan & @dirharishankar under @SrideviMovieOff
DOP #MynaaSukumar#YashodaTheMovie pic.twitter.com/SipgjoJzrn— Sridevi Movies (@SrideviMovieOff) December 6, 2021
ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ రోజు సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం” అని చెప్పారు.
కాగా సమంత తో పాటు ఇంకా ఈసినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: