యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుదల చేయగా.. అవి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది దేవర ఫస్ట్ సింగిల్ కోసం. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఆరోజున దేవర ఫస్ట్ లుక్ వస్తుంది అంటూ ఇప్పటికే అప్ డేట్లు వచ్చాయి. ఇప్పుడు తాజాగా అఫీషియల్ గా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ మే19వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పుడు తాజాగా ఈపాట శాంపిల్ అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.
It’s a warning notice from the Lord of Fear…. #FearSong Promo out now! #Devara
— Devara (@DevaraMovie) May 17, 2024
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























