ఈ ఏడాది సంక్రాంతి చిన్న సినిమాలతో సందడి చేయనుంది. పెద్ద పెద్ద సినిమాలు పోస్ట్ పోన్ కావడంతో భారీ రిలీఫ్ పొందిన చిన్న సినిమాలు ఇక తమ సినిమాలకు లైన్ క్లియర్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించేశాయి. ఈనేపథ్యంలోనే విశాల్ సామాన్యుడు కూడా సంక్రాంతి బరిలో దిగనున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. నిజానికి ఈసినిమాను ముందు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సామాన్యుడు ని కూడా సంక్రాంతి రేసులో దించాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించకపోవడం.. దానికితోడు తమిళనాడు ప్రభుత్వం కూడా థియేటర్లు మూయడానికి అనుమతులు ఇవ్వడంతో మళ్లీ రిలీజ్ డేట్ ను మార్చేశారు. ముందు ఫిక్స్ చేసిన డేట్ కే అంటే రిపబ్లిక్ డే రోజే సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మరి చూద్దాం ఆ రోజైనా సినిమా రిలీజ్ అవుతుందో.. లేక మళ్లీ వాయిదా పడుతుందో..!
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా యోగి బాబు, బాబురాజ్ జాకబ్, పిఎ తులసి, రవీనా రవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా..కవిన్ రాజ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: