వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈసినిమాతో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో రాబోతున్నాడు నాని. అంతేకాదు ఈసినిమాలో నాని మునుపెన్నడూ చూడని ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చి చాలా రోజులైపోయింది. అయితే ఇప్పుడు ఈసినిమా షూట్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు. తాజాగా చిత్ర బృందం క్లైమాక్స్ షూటింగ్‌ను ప్రారంభించింది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హ్యుజ్ సెట్‌ను నిర్మించారట. భారీ యాక్షన్ సీక్వెన్స్ ఈ క్లైమాక్స్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
It’s time for the reverberating 𝐓𝐡𝐮𝐧𝐝𝐞𝐫𝐨𝐮𝐬 𝐑𝐨𝐚𝐫 𝐨𝐟 𝐀𝐜𝐭𝐢𝐨𝐧 once again! 😎
The climax shoot of #SaripodhaaSanivaaram is taking place on a huge set in Hyderabad ❤️🔥
August 29th theatres lo pandagakki ready ga undandi 🥁🥁#SuryasSaturday
Natural 🌟… pic.twitter.com/7kwjhtcfkY
— DVV Entertainment (@DVVMovies) May 14, 2024
కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































