లవ్ మీ లో షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి – వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya Says I Played Different Role in Love Me

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరోయిన్ వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “లవ్ మీ ఇఫ్ యు డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఇదొక డార్క్ లవ్ స్టోరీ. షాకింగ్ ఎలిమెంట్స్, ప్రేమ, రొమాన్స్, థ్రిల్స్ ఇలా అన్ని అంశాలుంటాయి. పీసీ శ్రీరామ్ గారి విజువల్స్, కీరవాణి గారి మ్యూజిక్, అవినాష్ గారి అద్భుతమైన సెట్స్ అన్నీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ మూవీలో డిఫరెంట్‌గా, టఫ్‌గా ఉండే కారెక్టర్‌ను పోషించాను. లోలోపలే బాధపడుతుండే పాత్రను చేశాను. ఆశిష్ కారెక్టర్ ఎంతో మొండిగా ఉంటుంది. ఆయనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు చాలా మంచి డైలాగ్స్ రాశారు. నాపై నమ్మకంతో నాకు పాత్రను ఇచ్చిన దిల్ రాజు గారికి, హర్షిత్, హన్షితకు థాంక్స్. మే 25న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.