కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

వైష్ణవి, ఆశిష్‌లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది - రవికృష్ణ, సిమ్రన్

Love Me Trailer Launch Event: Actor Ravi Krishna and Actress Simram Comments

వైష్ణవి, ఆశిష్‌లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది - రవికృష్ణ, సిమ్రన్

Love Me Trailer Launch Event: Actor Ravi Krishna and Actress Simram Comments

Love Me Trailer Launch Event: Actor Ravi Krishna and Actress Simram Comments

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా నటుడు రవికృష్ణ మాట్లాడుతూ.. "విరూపాక్ష చేసిన టైంలో ఎలాంటి ఫీలింగ్ కలిగిందో ఈ మూవీకి చేసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. ఇంత మంచి చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. వైష్ణవి, ఆశిష్‌లతో పని చేయడం ఆనందంగా ఉంది. మే 25న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఆదరించండి" అని అన్నారు.

అలాగే నటి సిమ్రన్ చౌదరి మాట్లాడుతూ.. "స్కల్ రీకన్‌స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తాను. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థాంక్స్. ఈ మూవీకి తక్కువ రోజులే పని చేసినా వైష్ణవి, ఆశిష్‌లు ఫ్యామిలీ మెంబర్స్‌‌‌లా మారిపోయారు. మే 25న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి" అని అన్నారు.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్