దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు చరణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు. అన్నీ అనుకున్నట్టు ఉండి ఉంటే రేపు రిలీజ్ అయి ఉండేది. కానీ అందరినీ నిరాశ పరస్తూ మళ్లీ వాయిదా పడింది. ఒమిక్రాన్ ప్రభావం రోజు రోజుకి పెరగడంతో.. కొన్ని చోట్ల థియేటర్లు కూడా మూసేయడంతో ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టం కాబట్టి ఆర్ఆర్ఆర్ టీమ్ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది మాత్రం వేచి చూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ ను మాత్రం జక్కన్న ఓ రేంజ్ లో చేశాడని చెప్పొచ్చు. ఎన్టీఆర్, చరణ్ లను సౌత్, నార్త్ లలో వీలైనంత వరకూ తిప్పేశాడు. ఎన్నో ప్రెస్ మీట్ లు, టీవీ షోస్, స్పెషల్ ఇంటర్వ్యూలు ఇలా ప్రమోషన్స్ లో మాత్రం ఎక్కడా రాజీ పడకుండా చేశారు. ఇక దీనిలో భాగంగానే సాహెబా బాలి అనే యూట్యూబర్ గురించి తెలిసిందే కదా. ఫుడ్ ట్రీట్ తో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంది. అయితే ఎన్టీఆర్ తో ఇంటర్వ్యూ కోసం తనే హైద్రాబాద్ కు రావడం విశేషం. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఆమెకు హైదరాబాదీ బిర్యానీ, తెలంగాణ చేపల పులుసు, గుంటూరు చికెన్ వడ్డించాడు. ఆ సమయంలో సాహెబా.. ఆర్ఆర్ఆర్ లో రియల్ టైగర్ తో యంగ్ టైగర్ ఫైట్ చేశారా? అని అడగగా.. ‘ఏమో.. చేసుండొచ్చు, చేయకపోవచ్చు’ అంటూ సస్పెన్స్ లో పెట్టాడు. ఇక ఇదే క్రమంలో ఆర్ఆర్ఆర్ టీమ్ ని ఏయే వంటకాలతో పోలుస్తారని అడుగగా.. “బిర్యానీ చూడటానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ తయారు చేయాలంటే అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. రాజమౌళి కూడా అంతే. చూడటానికి సింపుల్ ఉంటారు కానీ పని విషయంలో పర్‌ఫెక్ట్.” అంటూ రాజమౌళిని బిర్యానీతో పోల్చాడు తారక్. చరణ్ ని పానీపూరితో పోల్చుతూ.. పానీపూరిని నోట్లో వేసుకోగానే దాని ఫ్లేవర్స్ బయపడతాయి. చరణ్ కూడా అంతే.. అంటూ తెలిపాడు. వీరితో పాటు ఆలియాను భట్ ఇరానీ బన్ మస్కాతో అలానే అజయ్ దేవగన్ తో వడా పావ్ తో పోల్చాడు. మరి ఎన్టీఆర్ వంట చేయడంలో కూడా ఎక్స్ పర్ట్ అని మనకు తెలిసిందే. అందుకే ఒక్కొక్కరి ని అంత ఈజీగా పోల్చుతూ.. సరైన వివరణ ఇవ్వగలిగాడు.
కాగా తెలుగుతో పాటు హిందీ, మళయాళం, తమిళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా తారక్ కనిపించనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: