ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఉన్న లాంగ్వేజ్ బారియర్స్ అనేవి దాదాపు చాలా వరకూ తొలగిపోయాయి. మన వాళ్లు ఇతర వాళ్లను తీసుకోవడం.. ఇప్పుడు మన వాళ్లు కూడా వేరే లాంగ్వేజస్ లో చేయడం.. ఇంకా విచిత్రం ఏంటంటే.. తమిళ్ హీరోలు డైరెక్ట్ గా తెలుగు సినిమాలను చేయడం.. దానికి తెలుగు డైరెక్టర్స్ దర్శకత్వం వహించడం ఇలా చాలా ఈక్వేషన్స్ ను చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు మరో కాంబినేషన్ కూడా రెడీ అయిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటి అనుదీప్ డైరెక్షన్ లో తమిళ్ స్టార్ కార్తికేయ హీరోగా సినిమా వస్తుంది. ఈ సినిమా తోనే టాలీవుడ్ లో డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు శివ కార్తికేయన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈనేపథ్యంలోనే తన ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేశాడు. అనుదీప్, కార్తికేయతో టైమ్ స్పెండ్ చేశాను.. జీనియస్ హ్యూమన్స్.. నేను ఫస్ట్ టైమ్ చాలా నవ్వుకున్నాను అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
Last Night Was My First Night tat I laughed Sooooooo muchhhhhh lol 🤣🤣🤣🤣
With this bunch of timing ⏱genius Humans on planet earth 🌍 darlings ♥️ @Siva_Kartikeyan @NaveenPolishety @anudeepfilm @manojdft @iamarunviswa 🥁🥁🥁🥁🍭🍭🍭🍭#SK20 🎵⭐️ pic.twitter.com/TvyZk6UTlf
— thaman S (@MusicThaman) January 6, 2022
కాగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంది. తను అందిస్తున్న ఆల్బమ్స్ అలానే బ్యాక్ గ్రాండ్ స్కోర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే పెద్ద సినిమాలకు మాత్రమే కాదు చిన్న సినిమాలకు కూడా థమన్ కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు. ఇక థమన్ కూడా కేవలం పెద్ద సినిమాలు అని మాత్రమే కాకుండా.. తనకు వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: