పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్‌లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. “లైగర్”మూవీ తెలుగు , హిందీ భాషలతో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. చిత్ర యూనిట్ “లైగర్”మూవీ గ్లింప్స్ ను డిసెంబర్ 31 వ తేదీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. యాక్షన్ సన్నివేశాలతో విజయ్ పవర్ ఫుల్ డైలాగ్స్ , అద్భుత మైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రూపొందిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: