శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ ‘భారతీయుడు2‘ ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా మధ్యలో ఆగిపోవడానికి కారణాలు ఏంటో కూడా తెలుసు. కమల్ వల్ల కొన్ని రోజులు గ్యాప్ వస్తే.. షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదం వల్ల మరికొన్ని రోజులు..ఇక కరోనా వల్ల మొత్తానికే బ్రేక్ పడింది. ఈగ్యాప్ లో లైకాకు, శంకర్ కు మధ్య వివాదాలు రావడం.. అవి కూడా క్లియర్ అవ్వడం జరిగాయి. మొత్తానికి త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈసినిమాలో విలన్ కోసం మరో టాలెంటెడ్ నడుడిని తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నటుడు ఎవరో కాదు మిన్నల్ మురళీ లో సూపర్ విలన్ పాత్రలో నటించిన గురు సోమసుందరం. రీసెంట్ గా వచ్చిన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక విలన్ పాత్రలో నటించిన గురు సోమసుందరం తన నటనతో అందరినీ ఆకట్టుకోవడంతో అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దీంతో భారతీయుడు 2 లో విలన్ కోసం తనని తీసుకోనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.
ఈ సినిమాలో ముందుగా కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు కాజల్ నటించట్లేదని తెలుస్తుంది. ఆ ప్లేస్ లో తమన్నాను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు వార్తలు అయితే వస్తున్నాయి. ఇంకా రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్, సిద్ధార్ధ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: