‘బంగార్రాజు’ టీజర్ రిలీజ్

Bangarraju Teaser Out Now,Telugu Filmnagar,Tollywood Movie Updates, Telugu Film News 2021, Tollywood Movie Updates, Latest Telugu Movie News, Latest Telugu Movie Updates,Tollywood Lates News,Bangarraju Teaser,Teaser,Bangarraju Teaser Released,Bangarraju Teaser Out Now,,King Nagarjuna Movie Teaser,Bangarraju,Bangarraju Movie,Bangarraju Movie Teaser,Bangarraju Movie Updates, Bangarraju Telugu Movie,Bangarraju Telugu Movie Latest News,Bangarraju Telugu Movie Teaser,Bangarraju Teaser,Bangarraju Teaser Released, Nagarjuna Movie, Nagarjuna starrer, Nagarjuna Bangarraju Telugu Movie, Nagarjuna’s Bangarraju Teaser out,Naga Chaitanya lastest Movie Bangarraju,Naga Chaitanya bangarraju Movie,Nagarjuna and Naga Chaitanya in Bangarraju Teaser out,Naga Chaitanya lastest Movie

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎంత హిట్ అయిందో తెలుసు. ఆసినిమాలో నాగ్ బంగార్రాజు పాత్రలో చాలా యాక్టీవ్ గా నటించి ఆకట్టుకున్నాడు. ఇక ఆపాత్ర పేరు మీదే ఇప్పుడు దీని సీక్వెల్ గా సినిమా తీస్తున్నారు. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా నుండి అక్కినేని అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు చిత్రబృందం. తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ చాలా ప్రెష్ గా ఉండి ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా నాగ్-చైతుల స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇక రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా సంక్రాంతికి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది ఉంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు అదే నిజం చేస్తూ ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ చివరిలో క్లారిటీ ఇచ్చారు.

ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగచైతన్య కి జోడీగా కృతి శెట్టి నటించనున్న సంగతి కూడా తెలిసిందే. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ, మోనాల్ గజ్జర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తుండగా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + three =