మాస్టర్ సినిమాతో ఈ ఏడాదిని స్టార్ట్ చేసిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ నే తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా చేస్తున్న సినిమా బీస్ట్. ఈసినిమా విజయ్ కెరీర్ లో వస్తున్న 65వ సినిమా. ఇక సినిమా ఇప్పటికే ఈసినిమా నుండి విజయ్ కు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ అవ్వగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈసినిమా కూడా సంక్రాంతికి వస్తుందేమో అని అనుకున్నారు. కానీ షూటింగే చాలా లేట్ అయింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించారు. ఇప్పుడు విడుదల చేసిన పోస్టర్ మరింత మాసివ్ గా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#BeastFromApril pic.twitter.com/UpzQJ78NH8
— Vijay (@actorvijay) December 31, 2021
కాగా ఈసినిమాలో పూజా హేగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. సెల్వ రాఘవన్ నెగెటివ్ రోల్ లో నటించనుండగా..ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: