మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న భారీ అంచనాలతో , భారీ ఎత్తున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో 200క్లబ్ దిశగా దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ కలెక్షన్స్ US లో 2మిలియన్ డాలర్స్ చేరువలో ఉన్నాయి. రఫ్ అండ్ మాస్ అవతార్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి. చంద్ర బోస్ రచన , సిద్ శ్రీరామ్ ఆలపించిన చూపే బంగారమాయెనా శ్రీవల్లి సాంగ్ యూట్యూబ్‌లో 100 మిలియన్స్‌కి పైగా వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. యానిమేషన్ షాట్స్ తో అద్భుతంగా తెరకెక్కిన శ్రీ వల్లి సాంగ్ లో అల్లు అర్జున్ డిఫరెంట్ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: