హోలీ రోజున “గని” మూవీ రిలీజ్?

Varun Tej's Ghani movie gets a new release date

అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. “గని”మూవీ లో బాలీవుడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ కథానాయిక. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు . థమన్ ఎస్ సంగీతం          అందించారు. ఈ మూవీ కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ వర్క్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్పోర్ట్స్ డ్రామా “గని”మూవీ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన “రాధేశ్యామ్” ,”రౌద్రం రణం రుధిరం”మూవీస్ సంక్రాంతి కి రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సంక్రాంతి రేస్ నుండి “భీమ్లా నాయక్ “మూవీ వైదొలగి ఫిబ్రవరి 25వ తేదికి పోస్ట్ పోన్అయ్యింది . పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన “భీమ్లా నాయక్ “మూవీ రిలీజ్ డేట్ మారడం మిగతా చిత్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఫిబ్రవరి 25వ తేది రిలీజ్ కావాల్సిన “F 3” మూవీ విడుదల తేది మారింది. ఈ నేపథ్యంలో “భీమ్లా నాయక్ “, “F 3” మూవీస్ విడుదల తేదీలు మారడంతో “గని “మూవీ రిలీజ్ కి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యం లో “గని ” మూవీ ని మార్చి లో హోలీ పండగ రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 17 =