దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఆర్ఆర్ఆర్ పై మొదటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే కేవలం తెలుగులోనే కాదు.. దేశం మొత్తం ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో చిత్రయూనిట్ చాలా బిజీగా ఉంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇక రాజమౌళి కాబట్టి ఎన్టీఆర్-చరణ్ కూడా నో చెప్పకుండా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. రాజమౌళి సినిమా అంటే మాములుగానే ఆసక్తి ఉంటుంది.. ఇక ఈ ప్రమోషన్స్ తో మరింత బజ్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసందర్బంగా ఒక హిందీ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ను స్ట్రైట్ హిందీ సినిమా ఎప్పుడు చేస్తారని అని అడుగగా దానికి ఎన్టీఆర్ అసలు తడుముకోకుండా బాలీవుడ్ ఆఫర్స్ కోసం తాను ఎదురుచూస్తున్నానని.. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఖచ్చితంగా పరిస్థితులు మారుతాయని అనిపిస్తుంది.. తప్పకుండా బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తాయని అనుకుంటున్నాను.. ఇలాంటి టైమ్ కోసమే ఎదురుచూస్తున్నా అంటూ క్లారిటీ ఇచ్చాడు.
మరి ఎన్టీఆర్ లాంటి హీరో ఇంత ఓపెన్ గా ఇలా చెపితే మేకర్స్ మాత్రం ఊరుకుంటారా.. మంచి కథతో ఎన్టీఆర్ దగ్గరకు వచ్చేస్తారు. మరి దీన్నిబట్టి త్వరలోనే ఎన్టీఆర్ హిందీ సినిమాను కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం ఆరోజు దగ్గర్లోనే ఉందేమో..



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: