నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ డిసెంబర్ 24న విడుదల కానుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. జిషు సేన్ గుప్తా , మురళీ శర్మ కీలకమైన పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“శ్యామ్ సింగ రాయ్” మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నాని కథానాయకుడిగా నటించిన చివరి రెండు సినిమాలు “వి”, “టక్ జగదీష్ ” మూవీస్ ఓటీటీలోనే విడుదల అయిన విషయం తెలిసిందే. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న “శ్యామ్ సింగరాయ్” కోసం నాని అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే “శ్యామ్ సింగరాయ్”కి భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి 70 థియేటర్ వద్ద 63 అడుగుల భారీ “శ్యామ్ సింగరాయ్” కటౌట్‌ని నిలబెట్టారు. అంతేకాదు కటౌట్‌పై క్రాకర్లు పేల్చి పూల వర్షం కురిపించారు కరోనా కు ముందు రిలీజ్ అయిన మూవీస్ కు థియటర్స్ వద్ద భారీ కటౌట్స్, పూల దండలతో , పాలాభిషేకాలు వగైరాలతో అభిమానుల కోలాహలంతో సందడి గా ఉండేది. ఇప్పుడు “శ్యామ్ సింగ రాయ్ “మూవీ తో పూర్వ వైభవం ప్రారంభం అయ్యింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: