భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప ఆ అంచనాలను నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. అల్లు అర్జున్ కెరీర్ లో మొదటిసారి వచ్చిన పాన్ ఇండియా మూవీ.. అందుకే ఈసినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తానికి మొదటి పాన్ ఇండియాతో దేశ వ్యాప్తంగా తన సత్తా చూపిస్తున్నాడు. మన హీరో కాబట్టి మన తెలుగు వాళ్లు ఎలాగైనా సినిమా చూసేస్తారు. కానీ వేరే భాషల్లో కూడా పుష్ప రాజ్ బాగానే తమ మార్క్ ను చూపిస్తున్నాడు. ముఖ్యంగా బన్నీ పర్ఫామెన్స్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎప్పుడూ స్టైలిష్ గా కనబడే బన్నీ ఈసినిమాకు తన కట్టు, భాష అన్నీ మార్చేశాడు. ఊరమాస్ లో బన్నీచేసిన రచ్చకు అందరూ ఫిదా అవుతున్నారు. దాని రిజల్టే ఇప్పుడు అటు టాక్ విషయంలోనూ.. ఇటు కలెక్షన్స్ లోనూ.. మరోవైపు ప్రశంసల్లోనూ కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఘన విజయం సాధించినందుకు చిత్రయూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. పుష్ప సక్సెస్ అనేది ఖచ్చితంగా టీమ్ వర్క్ దే.. అంతేకాదు దేశవ్యాప్తంగా తన అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు చాలా ఆనందంగా అలానే షాకింగానూ ఉందని తెలిపాడు.
కాగా ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ పలు కీలక పాత్రల్లో నటించారు.
ఇక ఇదిలా ఉండగా పార్ట్ 2 ను కూడా తొందరలోనే తీసుకురానున్నారు. పార్ట్ 2 పై వస్తున్న వార్తలపై బన్నీ క్లారిటీ కూడా ఇచ్చాడు. పార్ట్ 2 ఖచ్చితంగా ఉంటుందని.. సెకండ్ పార్ట్ లో కూడా ఎక్కడా తగ్గేదేలేదు అని.. తొందరలోనే పార్ట్ 2 షూటింగ్ ను కూడా స్టార్ట్ చేస్తామని తెలిపాడు. చూద్దాం మరి పార్ట్ 2 ఎలా ఉంటుందో.. పార్ట్ 1 ను మించి పార్ట్ 2 ఉంటుందేమో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: