పుష్ప : ది రైజ్ మూవీ రివ్యూ.. ఎక్కడా తగ్గని బన్నీ

Pushpa The Rise Telugu Movie Review,Pushpa,Pushpa Raj,Pushpa The Rise,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Review,Pushpa Movie Review,Pushpa Telugu Movie Review,Pushpa The Rise Movie,Pushpa The Rise Review,Pushpa The Rise Movie Review,Pushpa The Rise Telugu Movie Review,Pushpa The Rise Public Talk,Pushpa Public Tak,Pushpa Movie Public Talk,Pushpa Telugu Movie Public Talk,Pushpa Public Response,Pushpa Movie Public Response,Pushpa Review And Rating,Pushpa Movie Review And Rating,Pushpa Movie Rating,Pushpa Telugu Movie Review And Rating,Pushpa Public Talk And Public Response,Pushpa Movie Public Talk And Public Response,Pushpa The Rise Public Response,Pushpa Movie Updates,Pushpa Updates,Pushpa Movie Latest Updates,Pushpa Movie Update,Pushpa Telugu Movie Updates,Pushpa Telugu Movie Latest News,Pushpa Movie News,Pushpa Movie Latest News,Pushpa Telugu Movie Live Updates,Pushpa Movie Live Updates,Pushpa Movie Story,Latest Telugu Reviews,Latest Telugu Movie 2021,Telugu Movie Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,2021 Latest Telugu Movie Reviews,Latest Movie Reviews,New Telugu Movie,New Telugu Movies 2021,Telugu Reviews,Icon Star Allu Arjun,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Movies,Allu Arjun New Movie,Rashmika Mandanna,Sukumar,Sukumar Movies,DSP,Devi Sri Prasad,Pushpa Songs,Pushpa Movie Songs,Pushpa Trailer,Pushpa Movie Trailer,Allu Arjun,Allu Arjun Pushpa Movie Review.#PushpaTheRise,#ThaggedheLe,#Pushpa

ఫైనల్ గా అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి సినీ లవర్ ఎదురుచూస్తున్న సినిమా పుష్ప థియేటర్లలోకి వచ్చేసింది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ అవ్వడంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు విడుదలైన ప్రతి పోస్టర్, పాట, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ సినిమాపై ఇంకా ఆసక్తిని పెంచాయి. మరి భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక మందన్న, ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, ధనుంజయ, అనసూయ, రావు రమేష్, అజయ్‌, అజయ్‌ఘోష్‌ తదితరులు
డైరెక్టర్: సుకుమార్‌
బ్యానర్స్: మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా
నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కూబా బ్రొజెక్‌

కథ

రాయలసీమలోని శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతూంటుంది. ఇక ఒక కూలీ నుండి మొదలైన పుష్ప రాజ్ (అల్లు అర్జున్) జీవితం ఎర్ర చందనం స్మగ్లింగ్ లోనే కీలక పాత్ర ధారిగా ఎదుగుతాడు. ఎర్ర‌చంద‌నం స్మ‌గ‌ర్ల సిండికేట్‌లో ఓ భాగ‌స్వామిగా, త‌ర్వాత సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు. కొండారెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఆరితేరినవాడు. ఇక కొండారెడ్డి లాంటి కొందరు స్మగ్లర్స్ ని వెనక నుంచి లీడ్ చేసే బాస్ మంగళం శీను(సునీల్). ఎప్పటికప్పుడు తమ ఎర్ర చందనం దుంగలు స్మగ్లింగ్ కు కొత్త మార్గాలు అన్వేషిస్తూంటాడు. మరోవైపు ఎర్ర‌చంద‌నం స్మ‌గ‌ర్ల సిండికేట్‌లో ఓ భాగ‌స్వామిగా, త‌ర్వాత సిండికేట్‌నే శాసించే స్థాయికి చేరుకుంటాడు పుష్పరాజ్. ఈక్రమంలో కొండారెడ్డి తో పుష్పరాజ్ కు మధ్య వివాదాలు రావడం.. మరోవైపు పుష్ప రాజు ఎదుగుదలను చూసి మంగళం శ్రీను తట్టుకోలేకపోవడం వల్ల సమస్యలు మొదలవుతాయి. మరి మంగ‌ళం శ్రీను, కొండారెడ్డి తో శ‌త్రుత్వం పెంచుకున్న పుష్ప‌కి ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? శ్రీవ‌ల్లి (ర‌ష్మిక‌)ని ప్రేమించిన పుష్ప ఆమెని పెళ్లాడాడా లేదా? కొత్త‌గా వ‌చ్చిన ఎస్పీ భన్వ‌ర్ సింగ్ షెకావ‌త్ (ఫహాద్ ఫాజిల్‌)తో పుష్ప‌కి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయ‌న్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

సుకుమార్ మేకింగ్ ఎలా ఉంటుందో.. ఎంత బ్రిలియంట్ గా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. “రంగస్థలం” సినిమా లాగానే సుకుమార్ ఈ సినిమాలో కూడా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈసినిమాలో కూడా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో వచ్చాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. అలాంటి కథను తీసుకొని దాన్ని వందకు వందశాతం ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం సూపర్. స్టార్ డైరెక్టర్ కాబట్టి ఎలాంటి టేకింగ్ తీసుకోవాలో అలానే నడిపించాడు కథను. ఎర్ర‌చంద‌నం ఎంత విలువైందో, అది మ‌న శేషాచ‌లం అడ‌వుల నుంచి జ‌పాన్ వ‌ర‌కు ఎలా ప్ర‌యాణం చేస్తుందో చెబుతూ స్టార్ట్ చేసిన సుకుమార్ ఫస్ట్ హాఫ్ లో హీరో బ్యాక్ గ్రౌండ్.. కూలీ నుంచి సిండికేట్‌ నాయకుడిగా ఎదిగే విధానం.. ఆ సన్నివేశాలు చాలా బాగా చూపించాడు. విరామం ముందు వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయి. సెంకడ్ హాఫ్ లో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా ఫహద్‌ ఫాజిల్‌ పాత్ర పరిచయంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. ఇక ఈసినిమాను రెండు పార్ట్ లుగా తీసుకువస్తున్నారు కాబట్టి ఎండింగ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. అలానే ఫస్ట్ పార్ట్ ను ముగించాడు.

ఇక పుష్పరాజ్.. తనకు ఏం కావాలో అది సాధించుకునే వ్యక్తి. చుట్టూ పరిస్దితులు మారచ్చేమో కానీ తను మారడు. తనకు ఏం కావాలో అందుకోసం తనను తాను ఎంతవరకూ తెగించాలో కూడా స్ఫష్టంగా తెలుసు. అలాంటి పాత్రలో నటించిన అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేసేశాడు. అసలు ఈసినిమాపై అంత ఆసక్తిగలడానికి మెయిన్ రీజన్ అల్లు అర్జునే. దానికి తగ్గట్టే బన్నీ కూడా అన్ని షేడ్స్‌లో అదరగొట్టేశాడు. ఆయన బాడీ లాంగ్వేజ్, స్లాంగ్, కామెడీ టైమింగ్, ఎమోషన్స్ అన్నీ బాగా సెట్ అయ్యాయి. బన్నీ ఫ్యాన్స్ కు మాత్రం పండగే అని చెప్పొచ్చు. తగ్గేదేలే అంటూ ఈసినిమాపై ఎంత క్యూరియాసిటీని పెంచాడో అలానే తన నటనలో కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు చేశాడు.

ఇక రష్మిక మందన్న శ్రీవల్లిగా డీగ్లామర్‌ పాత్రలో చాలా సహజంగా ఉంది. కమెడియన్‌గా ప్రేక్షకులకు సుపరిచితమైన సునీల్‌ ఇందులో ప్రతినాయకుడు మంగళం శ్రీను పాత్రలో నటించాడు. ఈ పాత్ర కోసం సునీల్‌ మారిన తీరు, ఆయన డిక్షన్‌ బాగున్నాయి. మిగిలిన నటీనటులు అనసూయ, అజయ్‌ ఘోష్‌, రావు రమేశ్‌, ధనుంజయ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

ఈసినిమాలో టెక్నికల్ వాల్యూస్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా సినిమాటోగ్రఫి. నెక్ట్స్ లెవల్ ఉంది కూబా సినిమాటోగ్రఫి. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌లుక్‌లో చూపిస్తూనే, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించారు. ఇక యాక్షన్ సీక్వెన్స్ అయితే అదరగొట్టేశారు. మరోసారి దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ రైట్ హ్యాండ్ అని నిరూపించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఓరేంజ్ లో ఎక్కేశాయి. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదరగొట్టేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో మరోసారి చూపించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here