మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక కథానాయికగా ఎంపిక అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అనుకోని కారణాల వల్ల వైదొలగగా మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ని కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. 50 శాతం పైగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “హరిహర వీరమల్లు ” మూవీ తాజా షెడ్యూల్ జనవరి మొదటి వారం నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే భారీ సెట్ ను నిర్మించిన మేకర్స్ మరో భారీ సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో రెడీ చేస్తున్నారు. హీరో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తొలి పీరియాడికల్ డ్రామా “హరిహర వీరమల్లు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: