టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. వరుసగా గాలి సంపత్, రాజ రాజ చోర సినిమాలతో అలరించిన శ్రీ విష్ణు ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు రెడీ చెసేశాడు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు అర్జున ఫల్గుణ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నెల 31న ( డిసెంబర్ 31) మూవీ రిలీజ్ అవుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. దీనిలోభాగంగా రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అర్జునుడు సమరానికి సిద్ధం! ✊🏻#ArjunaPhalguna hitting the Big Screens Worldwide on Dec 31st! 🔥
Get Ready for some Pulsating Action! 💥#ArjunaPhalgunaOnDec31 ✅@MatineeEnt @sreevishnuoffl @DirTejaMarni #AnveshReddy @pasha_always @Actor_Amritha @priyadarshan_09 @anilandbhanu pic.twitter.com/OmClSB0GLS
— Matinee Entertainment (@MatineeEnt) December 16, 2021
కాగా ఈసినిమాలో శ్రీవిష్ణు సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమాలో శ్రీ విష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించబోతున్నాడు. అలాగే హీరోయిన్ గ్రామ వాలంటీర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























