సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా రూపొందుతున్న చిత్రం భీమ్లా నాయక్. పవర్ స్టార్ సినిమా అంటేనే దానికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక పవన్ కు రానా లాంటి హీరో తోడైతే ఇంకెలా ఉంటుంది. ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అలానే కనిపిస్తుంది. ఈసినిమా నుండి రిలీజ్ అయిన పవన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే రికార్డులు క్రియేట్ చేశారు. ఇక రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు రానా బర్త్ డే సందర్భంగా ‘భీమ్లా నాయక్‘ నుంచి ఆయనకు సంబంధించిన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ లో వాడు అరిస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా అరవగలను. ఎవడాడు? దీనమ్మా… దిగొచ్చాడా? ఆఫ్ట్రాల్ ఎస్సై. సస్పెండెడ్’ అని రానా డైలాగ్ చెప్పారు. ఇక దీన్ని బట్టి
సినిమాలో పవన్-రానా మధ్య జరిగే కోల్డ్ వార్ ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. మరి ఆ మ్యాజిక్ ను స్క్రీన్ పై చూడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
Wishing a very Happy Birthday to our Raging DANIEL SHEKAR ~ @RanaDaggubati 🔥
An Epic Clash awaits, in theatres 12 Jan 2022 💥🤘#SwagofDanielShekar ➡️ https://t.co/BDLIuijzY2#BheemlaNayak @pawankalyan #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @vamsi84 @dop007
— Sithara Entertainments (@SitharaEnts) December 14, 2021
కాగా పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాకి జంటగా సంయుక్త మీనన్ నటిస్తుండగా.. సముద్రఖని, మురళీశర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.