పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఖిలాడి” మూవీ రెండు సాంగ్స్ మినహా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది . అన్నపూర్ణ స్టూడియోలో రూపొందిన ప్రత్యేక సెట్ లో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో హీరో రవితేజ, మీనాక్షి చౌదరిలపై ఒక మాస్ సాంగ్ ఈ రోజు నుండి చిత్రీకరణ జరుపుకుంటుంది. మరో పాట షూటింగ్ మినహా “ఖిలాడి” మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ మూవీ తో పాటు హీరో రవితేజ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: