2డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై టి జె జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడిగా యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన “జై భీమ్” తమిళ మూవీ నవంబర్ 2 వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. లాయర్ చంద్రు గా స్టార్ హీరో సూర్య , గిరిజన మహిళ పార్వతి ఇన్ స్పిరేషన్ తో సినతల్లి పాత్రలో లిజో మోల్ జోస్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కిన “జై భీమ్” మూవీ అందరి మనసులను కదిలించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ “జై భీమ్ “మూవీ పై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “జై భీమ్” ఏ వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ అంటూ దర్శకుడి దర్శకత్వ ప్రతిభ , హీరో సూర్య యాక్టింగ్ అద్భుతమనీ , ఇటువంటి పవర్ ఫుల్ ఫిల్మ్స్ తో సమాజం లో పెను మార్పులు సంభవిస్తాయనీ , ” జై భీమ్ ” టీమ్ ను ప్రశంసిస్తూ దర్శకుడు శంకర్ ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























