సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ పై మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ , ఆయుష్ శర్మ , మహిమ మక్వాన ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ నవంబర్ 26 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. బుధవారం “అంతిమ్:ది ఫైనల్ ట్రూత్ మూవీ థ్యాంక్స్ మీట్‌ను హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్, ఆయుష్ శర్మ, డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
థ్యాంక్స్ మీట్‌లో హీరో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. సాధారణంగా తాను సినిమా రిలీజ్‌కు ముందే ఇండియాలోని ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్స్ చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం చేస్తుంటాననీ , అయితే ఇప్పుడు “టైగర్” మూవీ షూటింగ్ కారణంగా తనకు టైమ్ కుదరలేదనీ , అందుకనే ఇప్పుడు హైదరాబాద్ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పడానికి వచ్చాననీ , కరోనా కారణంగా.. గ్యాప్ తీసుకుని హిందీలోనే సినిమాను పూర్తి చేయాల్సి వచ్చిందనీ , అందుకనే ఈసారి డబ్బింగ్‌పై ఫోకస్ పెట్టలేదనీ , తన తదుపరి చిత్రాన్ని హిందీ, తెలుగులో విడుదల చేస్తాననీ , చిరంజీవిగారు, రామ్ చరణ్ తనకు మంచి స్నేహితులనీ , చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నా ననీ , ఆ వివరాలు తరువాత వెల్లడిస్తాననీ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: