మల్టీ స్టారర్ సినిమాలంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ స్టార్ హీరోలయితే ఆ క్రేజ్ ఇంకా ఉంటుంది. మరి అలా కాకుండా అగ్రహీరోలు అందులోనూ వేరే ఇండస్ట్రీ వాళ్లతో కలిసి చేస్తే వచ్చే ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా. మరి ఇప్పుడు ఉపోద్ఘాతం ఎందుకంటే మోహన్ రాజా దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో మోహన్ రాజా గాడ్ ఫాదర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా మలయాళ సినిమా లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో సల్మాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్లారిటీ కూడా వచ్చేసింది. ఇదిలా ఉండగా తాాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైద్రాబాద్ వచ్చిన సల్మాన్ మీడియా తో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఇక్కడ తనకు చాలా మంది మిత్రులున్నారని.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తనకు అత్యంత సన్నిహితుడని అన్నారు. త్వరలోనే ఆయన తో కలిసి నటించనున్నట్టు తెలిపారు.అంతేకాదు వెంకటేష్ కూడా తనకు సన్నిహితుడేనని.. త్వరలో వెంకటేష్ తో కూడా నటించబోతున్నాను అని తెలిపారు. దీంతో వెంకీ ఫ్యాన్స్ కూడా ఆ కాంబినేషన్ కూడా ఇప్పటినుండే ఎగ్జైటింగ్ గా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: