రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇకఈసినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే రాజమౌళి ఈసినిమా ప్రమోషన్స్ ను భారీగానే చేస్తున్నాడు. పోస్టర్లతోనే ఈసినిమాపై భారీ హైప్ పెంచిన రాజమౌళి ఇప్పుడు వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఆ పాటలు ఏ రేంజ్ లో వ్యూస్ తో దూసుకుపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇటీవలే రిలీజ్ చేసిన నాటు నాటు పాట ఎలా వైరల్ అయిందో.. తాజాగా రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ సోల్ ఆఫ్ యాంథమ్ అనే పేరుతో వచ్చిన పాట కూడా మిలియన్ల వ్యూస్ తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక తాజాగా ట్రైలర్ విడుదల తేదీని కూడా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. డిసెంబరు 3న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for the BIGGEST BLAST… 💥💥
TRAILER out on December 3rd.🤟🏻
Don’t keep calm, let the celebrations begin! 🤩#RRRMovie #RRRTrailer #RRRTrailerOnDec3rd @SSRajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies #RRRMovie pic.twitter.com/H71kE2xJJe
— RRR Movie (@RRRMovie) November 29, 2021
కాగా ఇందులో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. ఈ సినిమాతో చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరూ వీరులను కలిపి ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇక ఈసినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: