నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందులో వస్తున్న సినిమానే బింబిసార. నిజానికి ఈ సినిమా చాలా సైలెంట్ గా కంప్లీట్ చేశాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక అంతే సైలెంట్ గా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక టీజర్ ను చూస్తే కల్యాణ్ రామ్ బింబిసార అనే క్రూరమైన రాజుగా కనిపిస్తున్నాడు. త్రిగర్తాల సామ్రాజ్యాధినేత బింబిసారుడు ఏక చత్రాధిపత్యం కోసం రాజ్యాలపై దాడులు చేయడం, ఇతర రాజులను సామంతులను చేసుకోవడం, ఎదురు తిరిగిన వారిని చంపేయడం వంటి పనులను చేశారనే విషయాన్ని టీజర్ ద్వారా తెలియజేశారు.‘‘ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే.. కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే.. ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది’’ అనే డైలాగ్స్ అయితే ఆకట్టుకున్నాయి.
The ferocious #Bimbisara is here 🔥#BimbisaraTeaser out now!
▶️ https://t.co/Vw7haf6qei@NANDAMURIKALYAN @DirVashist @CatherineTresa1 @iamsamyuktha_ @Warina_Hussain @Music_Santhosh @ChirantannBhatt @anilpaduri pic.twitter.com/Ulm5OubHrl
— NTR Arts (@NTRArtsOfficial) November 29, 2021
కాగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. చిరంతన్ భట్ సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: