సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ మూవీ విడుదల కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “పుష్ప: ది రైజ్” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కు స్టార్ హీరోయిన్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఈ రోజు ప్రారంభం అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన చేసిన ఈ సాంగ్ కు గణేశ్ ఆచార్య కొరియో గ్రఫీ చేస్తున్నారు. అల్లు అర్జున్ , సమంత లపై తెరకెక్కుతున్న ఈ సాంగ్ ఈ మూవీ కే హైలైట్ కానుందని సమాచారం. సూపర్ హిట్ “S/O సత్యమూర్తి ” మూవీ లో సూపర్ మచ్చి సాంగ్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అల్లు అర్జున్ , సమంత ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: