బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తెలుగు సినిమాలను హిందీ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి సినిమాను కబీర్ సింగ్ గా హిందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తెలుగులో హిట్ కొట్టిన జెర్సీ సినిమాను కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమా సెట్స్ పైకి వెళ్లి కూడా దాదాపు రెండేళ్లు అవుతుంది. ఈసినిమా కోసం షాహిద్ కపూర్ క్రికెట్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక షూటింగ్ ప్రారంభమై కొద్దిరోజులు జరుపుకోగా మధ్యలో కరోనా రావడంతో అప్పటినుండి బ్రేక్ పడింది. ఇటీవలే షూటింగ్ ను రీస్టార్ట్ చేసి షూటింగ్ ను ఫినిష్ చేశారు. అంతేకాదు డిసెంబర్ 31న ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ ను చూస్తుంటే షాహిద్ కపూర్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. స్టోరీ అందరికీ తెలిసిందే అయినా షాహిద్ కపూర్ మాత్రం తన పాత్రలో ఒదిగిపోయినట్టే కనిపిస్తుంది.ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది
Unleash the power of dreams for the ones you love! Here’s presenting the #JerseyTrailer 🏏https://t.co/5KuV4WOvQR@shahidkapoor @mrunal0801 @gowtam19 #AlluAravind @AlluEnts @DilRajuProdctns @SitharaEnts @theamangill @vamsi84 @brat_films @jerseythefilm
— Naga Vamsi (@vamsi84) November 23, 2021
కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో షాహిద్ కు జోడీగా మృణాళిని ఠాకూర్ నటిస్తుంది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ, శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి తెలుగులో సూపర్ హిట్ అయిన ఈసినిమాను హిందీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: