సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆది సాయికుమార్ హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఆది లిస్ట్ లో ఉన్నాయి. కొన్ని షూటింగ్ పూర్తి చేసుకోగా కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. కొన్ని షూటింగ్ ను స్టార్ట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆది-పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో కిరాతక అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించారు మేకర్స్. మరోవైపు పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో ఆది మరో సినిమా చేస్తున్నాడు. అతిథి దేవోభవ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతుంది. ఇంకా అమరన్ సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇటీవలే మరో కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. శివశంకర్ దేవ్ దర్శకత్వంలో క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను నేడు ప్రారంభించారు. హైదరాబాద్ కోకాపేటలోని ఒక ప్రవేట్ హౌస్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇక తాజాగా ఈసినిమాలో హీరోయిన్ గా మిషా నారంగ్ నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో అలీ రెజా, నందిని రాయ్, తాకర్ పొన్నప్ప, వసంతి తదితరులు నటిస్తున్నారు. చాగంటి ప్రొడక్షన్ లో అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫీ జిశేఖర్, మ్యూజిక్ అనీష్ అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: