‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ తో మూడో సినిమా అఖండ తో వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో హ్యాట్రిక్ ఖాయం అన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా బాలకృష్ణ- గోపీచంద్ మలినేనితో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. రీసెంట్ గానే ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు కూడా. యదార్థ సంఘటనల ఆధారంగా గోపీచంద్ బాలకృష్ణ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసి పెట్టాడు. ఈ సినిమా ప్రారంభంకాకముందే భారీ అంచనాలు ఏర్పడిపోయాయి. త్వరలోనే ఈసినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
దీనితోపాటు బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా సినిమా చేయనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై తాజాగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. బాలకృష్ణ తో సీరియస్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్నానని కామోడీ ఎంటర్ టైన్ మెంట్ కాదని.. కాకపోతే అక్కడక్కడ కాస్త కామెడీని యాడ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. మరి ఇప్పటివరకూ కాస్త కామెడీ యాంగిల్ లోనే ఎక్కువ సినిమాలు తీసిన అనిల్ బాలయ్యతో ఏ రేంజ్ లో యాక్షన్ చేయిస్తాడో చూద్దాం.
ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా ముందు సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ పొంగల్ రేస్ నుండి తప్పించి ఫిబ్రవరికి వాయిదావేశారు. మరి ఈసినిమా అయిపోయిన తరువాత బాలయ్యతో సినిమాను పట్టాలెక్కిస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: