మెగాస్టార్ చిరంజీవి మరో సినిమాను మొదలుపెట్టేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా భోళా శంకర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి కూడా విదితమే. ఇక రాఖీ పౌర్ణమి రోజున ఈసినిమాను అధికారికంగా ప్రకటించగా ఇందులో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమా నేడు గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈరోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను ఘనంగా ప్రారంభించారు చిరంజీవి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, హరీశ్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ తదితరులు పాల్గొని, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. ముహుర్తపు షాట్‌లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్ కొట్టారు.
MEGA🌟 @KChiruTweets
& @MeherRamesh‘s#BholaaShankar🔱
Launched with a grand Pooja ceremony 🪔#BholaaShankarLaunch
📃#KoratalaSiva @directorvamshi @harish2you @megopichand @dirbobby @IamNShankar
🎬@Ragavendraraoba
🎥on #VVVinayak@AnilSunkara1 @AKentsOfficial @tamannaahspeaks pic.twitter.com/O5Cj4e2Rp3— AK Entertainments (@AKentsOfficial) November 11, 2021
ఇదిలా ఉండగా ఈసినిమా కాస్ట్ అండ్ క్రూ వివరాలు కూడా చిత్రయూనిట్ తెలియచేసింది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇంకా సినిమాటోగ్రఫి డూడ్లే.. సంగీతం మహతి సాగర్, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్ట్, ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్, ఫైట్ మాస్టర్స్ గా రామ్ లక్ష్మణ్-దిలీప్ సుబ్బరాయన్-కాయ్ చా కంపక్ దీ, కొరియోగ్రఫి శేఖర్ మాస్టర్, లిరిక్స్ రైటర్స్ రామ జోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీ మణి, సిరా శ్రీ.. వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా యుగంధర్, పబ్లిసిటీ డిజైనర్ గా అనిల్ అండ్ భాను, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్ గా రామకృష్ణ రెడ్డి-రవి దుర్గా ప్రసాద్, చీఫ్ కో డైరెక్టర్ గా లలిత్ ప్రభాకర్, అజయ్ కుమార్ వర్మ ప్రొడక్షన్ కంట్రోలర్ గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: