ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగా స్టార్ చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“భోళా శంకర్”మూవీ ప్రారంభోత్సవం ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు, బి.గోపాల్, ఎన్.శంకర్, కొరటాల శివ, వి వి వినాయక్, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ, సంగీత దర్శకుడు మణిశర్మ పాల్గొన్నారు. హీరోయిన్ తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. మెగా 155గా రూపొందనున్న ఈ మూవీ నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: