ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తెరకెక్కనున్న “భోళా శంకర్”మూవీ లో తమన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు.అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో చిరంజీవికి కీర్తీ సురేశ్ రాఖీ కడుతున్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చిరంజీవి , కీర్తి సురేష్ ల వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్”మూవీ లోని తన పాత్ర కోసం చిరంజీవి పూర్తి డిఫరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న “భోళా శంకర్” చిత్రాన్నిమేకర్స్ నిన్న సాయంత్రం ప్రారంభించారు . హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో చిరు పాత్ర కోసం ఫోటోషూట్, లుక్ టెస్ట్ చేసినట్టు, “భోళా శంకర్” ముహూర్త వేడుక నవంబర్ 11న ఉదయం 7:45 గంటలకు జరుగుతుందని, నవంబర్ 15 నుండి రెగ్యులర్ షూట్ జరుగుతుందని చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈమూవీ కి మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: