మెగా సుప్రీమ్ హీరో సాయి తేజ్ ఇటీవల బైక్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే కదా. ఆ తర్వాత రెండు నెలలకు పైగా హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు సాయి తేజ్. దసరా రోజున సాయి ధరమ్ తేజ్ తన పుట్టినరోజున డిశ్చార్జ్ అయ్యారు. ఇక అప్పుడప్పుడు సాయి తేజ్ తన ట్విట్టర్ ద్వారా తాను బాగానే ఉన్నానని చెబుతూ అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా తన ఫొటోను కూడా షేర్ చేశాడు సాయి తేజ్. దీపావళి సందర్భంగా మెగా హీరోలందరితో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈసందర్భంగా చిరు తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తూ అందరి ఆశీస్సులు దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నాడు. మా కుటుంబ సభ్యులందరికి ఇది నిజమైన పండుగ అని తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక చిరంజీవి ట్వీట్ చేసిన పోస్ట్ ను రీ ట్వీట్ చేస్తూ ”నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం” అని పేర్కొన్నారు.
నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్ధనలకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం.🙏🏼 https://t.co/2de1Ob2JgC
— Sai Dharam Tej (@IamSaiDharamTej) November 5, 2021
ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: