సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ కోసం చేస్తున్న “సర్కారు వారి పాట” మూవీ ఆల్బమ్ చాలా స్పెషల్ అని సంగీత దర్శకుడు థమన్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. .ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీపై మ్యూజిక్ ఆల్బమ్ పరంగానూ థమన్ అంచనాలు భారీ స్థాయిలో పెంచుతున్నారు. “సర్కారు వారి పాట”మూవీ ఆల్బమ్ తన హృదయానికి చాలా దగ్గర అయిందనీ , ఈ ఆల్బమ్ కోసం ఏ రోజు అసలు తగ్గకుండా వర్క్ చేస్తాననీ , మన సూపర్ స్టార్ కోసం చేస్తున్న ఈ ఆల్బమ్ చాలా స్పెషల్‌గా ఉంటుందని థమన్ ట్వీట్ చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: