లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా విక్రమ్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ కు కూడా చాలా బ్రేక్ లు పడ్డాయి. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను మళ్లీ స్టార్ట్ చేశారు. గత ఏడాది కమల్ బర్త్ డే సందర్భంగా ఈసినిమా ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ ఏడాది బర్త్ డేకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నారు. రేపు నవంబర్ 6న కమల్ హాసన్ బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఆయన పుట్టిన రోజు కానుకగా విక్రమ్ మూవీ టీజర్ విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you @Dir_Lokesh and team. #Vikram_April2022@RKFI @anirudhofficial @VijaySethuOffl #Fahaadh @kalidas700 @gopiprasannaa @girishganges @turmericmediaTM @APIfilms https://t.co/ZwunTEKIp9
— Kamal Haasan (@ikamalhaasan) November 5, 2021
కాగా ఈసినిమాలో టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో.. ఈసినిమా కోసం అభిమానులతో పాటు సినీలవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కమల్ హాసన్‌ను ఇంతకు ముందెప్పుడూ చూపించని విధంగా లోకేష్ కనగరాజ్ చూపించనున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈసినిమాలో పహాద్ ఫాజిల్, కాళిదాస్ జయరామ్, పలువురు ప్రముఖ నటీనటులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కమల్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: