ఈ ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు హీరో రవితేజ . ఈ మూవీ సక్సెస్ ఇచ్చిన జోష్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రమేష్ శర్మతో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దీనితో పాటు శరత్ మండవతో అలాగే త్రినాథ్ రావు నక్కినతో సినిమాలు లైన్‌లో పెట్టాడు రవితేజ. ఈరెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితో పాటు మరో రెండు సినిమాలు కూడా రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా తన 71వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా టైటిల్ ను నేడు ప్రకటించారు మేకర్స్. టైగర్ నాగేశ్వరరావు అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా ఈసారి రవితేజ డిఫరెంట్ కథతో వస్తున్నట్టు అర్థమైంది. ఇక ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.
తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ లో ఈసినిమాను తెరకెక్కించనున్నారు.
#TigerNageswaraRao pic.twitter.com/jWUKmM5iEq
— Ravi Teja (@RaviTeja_offl) November 3, 2021
కాగా ఇప్పటికే రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఈసినిమాకు రావణాసుర అనే టైటిల్ ను అనుకున్నట్టు ఇప్పటికే వార్తలు మొదలయ్యాయి. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీమ్‌వర్క్స్ పతాకాలపై అభిషేక్‌నామాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: