క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన తరువాత మాస్ మహారాజా ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక సినిమా తరువాత మరొక సినిమాను వెంట వెంటనే లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయింది.. ఇంకో పదిరోజులు షూటింగ్ మిగిలిఉండగా దానిని పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను పెన్ స్టూడియోస్ సమర్పణలో హవీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్ లో పెడుతున్నాడు. రవితేజ 70వ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రేపు ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. అభిషేక్ పిక్చర్ మరియు ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మరోవైపు శరత్ మందవా అనే దర్శకుడితో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు రవితేజ. ఇది కూడా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఇక ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: