అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా వస్తున్న సినిమా ‘మహా సముద్రం’. ఇన్‌టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా ఈసినిమా రూపొందించినట్టు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ లను చూస్తే అర్థమవుతుంది. ఇక ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలిఉంది. మరోవైపు చిత్రయూనిట్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ మరింత బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈనేథ్యంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అదితి రావు హైదరి ఈసినిమాలో తన పాత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో నాపాత్ర చాలా సింపుల్ అండ్ బబ్లీ క్యారెక్టర్ చిన్న పిల్లలకు డ్యాన్స్ చెప్పే టీచర్ గా నటిస్తున్నాను..ఈసినిమా కోసం డైరెక్టర్ గారు నన్ను కలిసి కథ చెప్పినప్పుడు నాకు చాలా బాాగా నచ్చింది. ఆయన కథ చెప్పిన విధానానికి చాలా ఇంప్రెస్ అయ్యాను.. నో చెప్పలేకపోయాను. అయితే నాకు అప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. అయినా కూడా డైరెక్టర్ గారు నాతోనే ఈసినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు.. నా డేట్స్ కోసం నన్ను ఫాలోఅప్ చేసిన విధానం చూసి నాకే ఏడుపొచ్చింది అని తెలియచేసింది. ఇంకా సినిమా గురించి చెబుతూ శర్వానంద్, సిద్దార్థ్, జగపతిబాబు, రావు రమేష్ లాంటి నటులతో చేసినందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నాను అని చెప్పుకొచ్చింది.
కాగా ఈ సినిమాలో అదితి రావు హైదరి తో పాటు అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రావు రమేష్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. రాజ్ తోటా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: