బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా అఖండ. ఈసినిమా షూటింగ్ కు కూడా చాలా బ్రేక్ లు పడిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ లోనే రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఈసినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నుండి మరో టీజర్ ను రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. టైటిల్ సాంగ్ ను దసరా పండగ సందర్భంగా అలాగే సెకండ్ టీజర్ ను అక్టోబర్ చివరిలోరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్. సెకండ్ టీజర్ మాత్రం ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ తో కట్ చేయనున్నట్టుగా కూడా టాక్స్ వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.
ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని పనులు త్వరగా పూర్తి చేసి దసరాకు ఈసినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: