తెలుగు ,తమిళ భాషల “విరాట్టు “మూవీ తో మోడల్ ప్రగ్య జైస్వాల్ టాలీవుడ్ , కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.“కంచె “, “గుంటూరోడు “, “జయ జానకి నాయక “వంటి మూవీస్ లో ప్రగ్య జైస్వాల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “కురుక్షేత్ర ” మూవీ తో కన్నడ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలీవుడ్ మూవీ “అంతిమ్ :ది ఫైనల్ ట్రూత్ ” లో ప్రగ్య కథానాయికగా నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతున్న సమయంలో ప్రముఖ కథానాయిక ప్రగ్యా జైశ్వాల్ కరోనా బారిన పడటం ఆమె నటిస్తున్న ‘అఖండ’ చిత్ర యూనిట్ ను ఆందోళనకు గురి చేసింది. రెండుసార్లు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ.. ఇప్పటికే ఓసారి కరోనా సోకినప్పటికీ.. మళ్లీ తాను కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాననీ , వైద్యుల సూచనలు పాటిస్తూ, జాగ్రత్త వహిస్తూ ఐసొలేట్ అయ్యాననీ , గత పది రోజుల్లో తనతో సన్నిహితంగా ఉన్న వాళ్లందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాననీ సోషల్ మీడియాలో ప్రగ్య పోస్ట్ పెట్టారు. గత పది రోజుల్లో ప్రగ్య తో సన్నిహితంగా ఉన్నది ‘అఖండ’ టీమ్ సభ్యులే కాబట్టి వాళ్లకు ఆందోళన తప్పదు. గోవాలో కొన్ని రోజుల కిందటే ‘అఖండ’ చివరి షెడ్యూల్ ముగిసింది. ఆ తర్వాత చిత్ర బృందం ముగింపు వేడుకను కూడా చేసుకున్నా విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: