టాలీవుడ్ లో వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకడు. మొదటి నుండి కాస్త డిఫరెంట్ కథలనే ఎంచుకంటూ కెరీర్ ను మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. ఆ తరువాత పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ పంచ్ అంటూ ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. డిసెంబర్ 3న ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ తెలిపంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
When Passion Meets Emotion,
the impact is beyond Imagination!!Presenting the first punch of
Ghani🥊https://t.co/PzrXypPG0PComing to knock you out on December 3rd 2021!#GhaniFirstPunch#TeamGhani#Ghani
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 6, 2021
యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది. ఇంకా సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్రల లాంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: